త‌మిళంలోను మ‌హాన‌టి టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్‌

Wed,April 18, 2018 08:12 AM
Nadigaiyar Thilagam crossed 7 million mark

అలనాటి అందాల తార సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ‘నడిగర్ తిలగమ్’ అనే టైటిల్ తో ఈ మూవీ కోలీవుడ్ లోను విడుదల కానుంది . మే 9న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. ఏప్రిల్ 14న సాయంత్రం 7గం.ల‌కి చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసారు మేక‌ర్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఈ టీజ‌ర్‌కి మూడు ల‌క్ష‌ల‌కి పైగా వ్యూస్ వ‌స్తే, త‌మిళంలో 7 ల‌క్ష‌ల వ్యూస్ రావ‌డం విశేషం. టీజ‌ర్‌లో కీర్తి సురేష్ లుక్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో అలరించింది. నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి పాత్రని కీర్తి సురేష్ పోషించ‌గా, మధుర వాణి అనే జర్నలిస్ట్ పాత్రలో సమంత, విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ, జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ , ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు న‌టిస్తున్నారు. ముఖ్య పాత్రల‌లో షాలిని పాండే, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్‌భాస్కర్ తదితరులు కనిపించనున్నారు. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందించారు. సి. అశ్వినీదత్ సమర్పణలో వైజ‌యంతి సినిమా పతాకంపై స్వప్నదత్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది.

2075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles