మెర్సిడేజ్ బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ భామ

Mon,October 14, 2019 08:01 PM


ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మాస్ రోల్ లో కనిపించి థియేటర్లలో అందరితో ఈలలు వేయించింది బెంగళూరు భామ నభానటేష్. ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టిన నభానటేష్ ఇటీవలే ఖరీదైన మెర్సిడేజ్ బెంజ్ రెడ్ కారును కొనుగోలు చేసింది. మెర్సిడేజ్ కారును తనకు తానే బహుమతిగా ఇచ్చుకున్నట్లు తెలిపింది. కారు కొన్న తర్వాత షోరూంలో..బయట దిగిన కొన్ని ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసింది.


ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో ఛార్మి, పూరీ ఒక‌రికొక‌రు కార్లని బ‌హుమ‌తులుగా ఇచ్చుకున్న విషయం తెలిసిందే. ఛార్మికి పూరీ బీఎండబ్యూ 7 సిరీస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగా.. పూరీ జగన్నాథ్‌కు రేంజ్ రోవర్ వోగ్‌ను ఛార్మీ బహుమతిగా ఇచ్చాడు.

2851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles