మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ విడుదల చేసిన ధనుష్

Sun,March 26, 2017 08:57 AM
Naan Pizhaippeno - Single song

తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం ఇటు నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా ఫుల్ బిజీ అయ్యాడు. తొలిసారి తన దర్శకత్వంలో పవర్ పాండి అనే చిత్రం తెరకెక్కించాడు ధనుష్. ఇటీవల ఈ చిత్ర ఆడియోని విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నాడు. తన నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా ఓ మూవీ రూపొందించే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక నటుడిగా విఐపి 2 అనే చిత్రంతో పాటు ఎనై నొక్కి పాయిమ్ తొట్ట అనే సినిమాలలో నటిస్తున్నాడు ఈ తమిళ హీరో.

ఎనై నొక్కి పాయిమ్ తొట్ట అనే తమిళ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్ ఇటీవల విడుదల అయింది. వీటి్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోండగా, ఈ మూవీలో ధనుష్ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించి మరో లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. తమరై రాసిన ఈ పాటను సత్య ప్రకాశ్ పాడారు. మరి మీరు ఈ సాంగ్ ని చూసి ఎంజాయ్ చేయండి.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles