స్పీడు పెంచిన ‘నామ్ షబానా’

Sat,March 25, 2017 09:15 AM
Naam Shabana song

సొట్టబుగ్గల సుందరి తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం నామ్ షబానా. బేబి మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ నామ్ షబానా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది తాప్సీ. శివం నాయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రంలో తాప్సీ బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేసింది. ఈ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది . మార్చి 31,2017న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం నేనే షబాన అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇటీవల తెలుగు తో పాటు హిందీ భాషలకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది టీం. ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. ఇక సినిమా రిలీజ్ మరింత దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా చిత్రంలోని జుబి జుబి అనే సాంగ్ ని విడుదల చేశారు. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

1018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles