ఇంట్రెస్టింగ్ గా ఉన్న థియేట్రికల్ ట్రైలర్

Fri,March 17, 2017 12:15 PM

సొట్టబుగ్గల సుందరి తాప్సీకి టాలీవుడ్ అంతగా కలిసిరాకపోయినప్పటికి హిందీలో మాత్రం మంచి విజయాలు సాధిస్తూ ఫుల్ క్రేజ్ పెంచుకుంటుంది. పింక్ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ తో ఘాజీలో నటించింది తాప్సీ. తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో పాటు నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రానా, తాప్సీల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక బేబి మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ నామ్ షబానా అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది తాప్సీ. శివం నాయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రంలో తాప్సీ బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేసింది. ఈ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది . మార్చి 31,2017న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం నేనే షబాన అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇటీవల తెలుగు భాషకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన టీం తాజాగా హిందీలో థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు మూవీపై భారీ అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.


2274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles