తాప్సీలో ఇంతటి టాలెంట్ ఉందా..!

Sat,February 11, 2017 09:24 AM
Naam Shabana Official Theatrical Trailer

పింక్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న తాప్సీ ప్రస్తుతం నామ్ షబానా అనే చిత్రం చేస్తున్నది. బేబి మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ శివం నాయర్ దర్శకత్వంలో రూపొందుతుంది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేసింది. ఈ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది ఈ ఢిల్లీ భామ. తాజాగా నామ్ షబానా చిత్ర ట్రైలర్ ని విడుదల చేయగా ఇందులో తాప్సీ పడ్డ కష్టం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలలోనే నటించి మెప్పించిన తాప్సీ నామ్ షబానా చిత్రంతో తనలో దాగి ఉన్న మరో కోణాన్ని కూడా ప్రేక్షకుల ముందు పెట్టనుంది. మార్చి 31,2017న ఈ చిత్రాన్ని విడుదలకు సిద్దం చేస్తున్నారు. తాప్సీ నటించిన 'ఘాజీ', 'రన్నింగ్‌ షాదీ డాట్‌ కామ్‌' చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. మరి తాజాగా విడుదలైన నామ్ షబానా ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

2541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles