డ‌బుల్‌ హ్యాట్రిక్‌పై క‌న్నేసిన మైత్రి మూవీస్ సంస్థ‌

Sun,August 12, 2018 12:39 PM
Mythri Movie Makers concentrate on hat trick

న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ముగ్గురు క‌లిసి మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌పై విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. వీరు ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సినిమాల‌న్నీ మంచి విజ‌యం సాధించ‌డంతో, రాబోవు సినిమాల‌పై ఆస‌క్తి నెల‌కొంది. మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌పై రూపొందిన శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ , రంగ‌స్థ‌లం చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ బేన‌ర్‌లో ర‌వితేజ హీరోగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అనే సినిమా రూపొందుతుంది. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక చైతూ హీరోగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌వ్యసాచి చిత్రం కూడా ఇదే బేన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతుంది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 2న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల‌పై చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌పై ర‌వితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొంద‌నుంది. కాజ‌ల్‌, కేథ‌రిన్ క‌థానాయిక‌లుగా చిత్రం తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రం కూడా ఇదే బేన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమాపై బోలెడ‌న్ని అంచ‌నాలు ఉన్నాయి. మొత్తానికి తీసిన మొద‌టి మూడు సినిమాల‌తో మంచి హ్య‌ట్రిక్ విజయం అందుకున్న ఈ నిర్మాణ సంస్థ రానున్న చిత్రాల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ కొడుతుందేమోన‌ని అభిమానులు భావిస్తున్నారు.


2806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles