తెలుగ‌మ్మాయి కావ‌లెను

Wed,September 5, 2018 09:14 AM

న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ముగ్గురు క‌లిసి నిర్మించిన సంస్థ‌ మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ వెళుతున్న వీరిని వ‌రుస విజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌పై రూపొందిన శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ , రంగ‌స్థ‌లం చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ బేన‌ర్‌లో ర‌వితేజ హీరోగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అనే సినిమా రూపొందుతుంది. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక చైతూ హీరోగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌వ్యసాచి చిత్రం కూడా ఇదే బేన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతుంది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 2న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల‌పై చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌పై ర‌వితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొంద‌నుంది. కాజ‌ల్‌, కేథ‌రిన్ క‌థానాయిక‌లుగా చిత్రం తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రం కూడా ఇదే బేన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమాపై బోలెడ‌న్ని అంచ‌నాలు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటించేందుకు హీరోయిన్‌ కోసం వేట ప్రారంభించారు. రంగస్థలం చిత్రానికి రైటర్‌గా పని చేసిన బుచ్చి బాబు స‌నా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రానికి కాస్టింగ్ కాల్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం తెలుగ‌మ్మాయి కావాల‌ని పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో అమ్మాయి వయస్సు 18-24 సంవత్సరాల మధ్యలో ఉండాలని పేర్కొంది. తెలుగు అమ్మాయిలకు మాత్రమే ఈ అవకాశం అని ప్రత్యేకంగా తెలిపింది. ఆసక్తికల వారు తమ ప్రొఫైల్, డెమో రీల్స్, ఇంట్రో వీడియోలను తమకు మెయిల్ చేయాలని స్పష్టం చేసింది.


7266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles