రాహుల్ గాంధీ బ‌యోపిక్ టీజ‌ర్ విడుద‌ల‌

Sun,February 10, 2019 10:54 AM

ప్ర‌స్తుతం దేశ‌మంత‌టా బ‌యోపిక్‌ల సీజ‌న్ న‌డుస్తుంది. రాజ‌కీయ నాయ‌కుల జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ప‌లు సినిమాలు ఇటీవ‌ల విడుద‌ల కాగా, మ‌రి కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జీవిత నేప‌థ్యంలోను బ‌యోపిక్ రూపొందిస్తున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌గా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ జీవితంపై ఓ బ‌యోపిక్ రూపొందుతుంది. మై నేమ్ ఈజ్ రాగా అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో రాహుల్ గాంధీ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ జీవితాన్ని చూపించ‌నున్నారు


సెయింట్ డ్రాకులా, కామ‌సూత్ర వంటి చిత్రాలు తెర‌కెక్కించిన పాల్ రూపేష్ ద‌ర్శ‌క‌త్వంలో మై నేమ్ ఈజ్ రాగా తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో గాంధీ ఫ్యామిలీకి చెందిన వారంద‌రిని చూపిస్తూ రాహుల్ రాజ‌కీయ ఆరంగేట్రం జ‌రిగిన విధానాన్నిక్లుప్తంగా చూపించారు. ఇది రాహుల్ బ‌యోపిక్ కాద‌ని, అత‌నిపై జ‌రుగుతున్న దాడి నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడో చూపించే ఇతి వృత్త‌మ‌ని ద‌ర్శ‌కుడు రూపేశ్ అంటున్నాడు.

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్‌ని విజ‌యం సాధించిన త‌ర్వాత ఎవ‌రు ఆప‌లేరు. ఇదే సినిమా క‌థ అంటూ ద‌ర్శ‌కుడు పేర్కొన్నాడు. ఇంట్రెస్టింగ్ లొకేష‌న్స్‌లో చిత్ర షూటింగ్ చేస్తున్న చిత్ర బృందం యూఎస్‌లోని కొల్లిన్ కాలేజ్‌, ఇట‌లీని ఆయ‌న గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో కొన్ని కీల‌క స‌న్నివేశాలు షూట్ చేయ‌నున్నార‌ట‌. త‌క్కువ షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్న మేము క్రియాశీల రాజకీయాల్లో ప్రియాంక ప్రవేశాన్ని చివ‌రి సీన్‌గా షూట్ చేస్తామ‌ని రూపేష్ అన్నారు. 2019 ఎల‌క్షన్స్‌కి ముందు ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. మ‌రి ఈ చిత్రం ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో.

1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles