ప్రియా పాట‌పై ఫైర్ అవుతున్న ముస్లిం సంఘాలు..!

Sun,February 18, 2018 09:39 AM
muslims fire on malayalam song

ఒక్క క‌న్ను కోట్టి కోట్లాదిమంది అభిమానుల మ‌న‌సు గెలుచుకున్న కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఒరు ఆదార్ లవ్’ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ సంపాందించుకుంది. అయితే ఇప్పుడు ఈ సాంగ్‌పై ప‌లు వివాదాలు నెల‌కొంటున్నాయి. మొన్న‌టికి మొన్న హైద‌రాబాద్‌లోని కొంద‌రు ముస్లిం యువ‌కులు ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాట మా మ‌నోభావాలని కించ‌ప‌రిచేలా ఉంద‌ని పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. తాజాగా ముంబై నగరానికి చెందిన పలు ముస్లిమ్ సంఘాలు ఈ పాట‌పై ఫైర్ అవుతున్నాయి. చిత్రంలో నుండి వెంట‌నే ఈ సాంగ్ తొల‌గించాల‌ని, ఈ విష‌యంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ పాట ముహమ్మద్ ప్రవక్త అతని భార్యను తప్పుగా చూపిస్తూ ముస్లిమ్ పెద్దలను అవమానిపర్చేలా ఉందని రజా అకాడమి వ్యవస్థాపక అధ్యక్షుడు సయీద్ నూరీ చెప్పారు. మరోవైపు త‌క్కువ టైంలో ఫుల్ పాపులారిటీ పొందిన ఈ సాంగ్‌ని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని తంజీమ్ ఉలేమా -ఏ- అహ్లే సున్నత్ జ అల్ హఖ్ వెల్ఫేర్ ఫౌండేషన్ డిమాండు చేసింది. ఇక తంజీమ్ ఉలేమా -ఏ- అహ్లే సున్నత్ జ అల్ హఖ్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి ఫరూఖీ రజ్వీ తాము వైర‌ల్ అయిన పాట‌ని వెంట‌నే నెట్‌లో నుండి తీసి వేయాల‌ని పోలీసులు, సైబర్ సెల్ విభాగాలను కోరిన‌ట్టు తెలిపాడు. మ‌రి ముస్లిం సంఘాల ఆరోప‌ణ‌ల క్ర‌మంలో మార్చి 3న విడుద‌ల కానున్న ఒరు ఆదార్ ల‌వ్ చిత్రంలో పాట‌ని ఉంచుతారో తొల‌గిస్తారో చూడాలి.

1717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS