మూడు గుడ్ల‌కు రూ.1672 బిల్లు వేసిన 5స్టార్ హోట‌ల్

Fri,November 15, 2019 11:16 AM

5 స్టార్ హోట‌ల్ అంటే ప్ర‌తీది చాలా ల‌గ్జరీగా ఉంటుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. హోట‌ల్‌లో ఏది తిన్నాల‌న్నా కూడా చాలా ఖ‌రీదే ఉంటుంది. కాక‌పోతే క‌ళ్ళు బైర్లు క‌మ్మే రేట్లు వేస్తే మాత్రం షాక్ కావ‌డం ప్ర‌తి ఒక్క‌రి వంతు అవుతుంది. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియానీకి ఇలాంటి సంఘ‌ట‌నే ఎదురైంది. గుజ‌రాత్ రాష్ట్రంలోని అహ్మ‌దాబాద్‌లో ఉన్న హ‌య‌త్ రీజెన్సీ హోట‌ల్‌లో ఆయ‌న బ‌స చేశారు. గురువారం రోజు ఆయ‌న భోజ‌నంతో పాటు మూడు ఎగ్స్‌ని ఆర్డ‌ర్ చేశారు. ఆ మూడు ఎగ్స్‌కి హోట‌ల్ వారు ఏకంగా రూ.1672 బిల్లు వేశారు. ఆ బిల్లును చూసి శేఖర్ ఆశ్చర్యపోయాడు. వెంట‌నే దానిని ఫోటో తీసి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. శేఖ‌ర్ పోస్ట్ చేసిన బిల్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, దీనిపై హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు నెటిజ‌న్స్. హోట‌ల్ యాజ‌మాన్యాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. మూడు ఉడికించిన కోడిగుడ్లకు 1350 రూపాయలు, సర్వీస్ చార్జీగా 67.50 రూపాయలు, సీజీఎస్టీ 9శాతం కింద 127.58 పైసలు, ఎస్ జీఎస్టీ 9శాతం కింద మరో రూ.127.58 కలిపి మొత్తం 1672రూపాయలు బిల్లు వేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై హోట‌ల్ యాజ‌మాన్యం ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.
2466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles