క‌థ నాదే అన్న వ‌రుణ్‌..కోర్టులో తేల్చుకుంటాన‌న్న మురుగ‌

Sun,October 28, 2018 01:33 PM
murugadoss fire on varn

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్, స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి సినిమాలు ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో స‌ర్కార్ చిత్రం రూపొందుతుంది. న‌వంబ‌ర్ 6న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర త‌మిళ టీజ‌ర్ ద‌స‌రా కానుక‌గా విడుద‌లై రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించింది. కీర్తి సురేశ్‌, వరలక్ష్మీ ప్రధాన పాత్రల్లో న‌టించారు. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండగా ప‌లు వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టు ముడుతున్నాయి. ఆ మ‌ధ్య పోస్ట‌ర్ విష‌యంలో ప‌లు వివాదాలు చెల‌రేగ‌గా, తాజాగా ఈ సినిమా క‌థ త‌నదేనంటూ, ఈ క‌థ‌ని కొన్ని సంవ‌త్స‌రాల క్రిత‌మే రిజిస్ట‌ర్ చేశానంటూ వ‌రుణ్ రాజేంద్ర‌న్ అనే వ్య‌క్తి కేసు వేశాడ‌ట‌. అంతేకాదు తనకు రూ.30లక్షల నగదు, టైటిల్స్‌లో స్టోరీ క్రెడిట్‌ ఇవ్వాలని డిమాండ్‌చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ విష‌యాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటున్నాడు మురుగ‌దాస్. వ‌రుణ్ అనే వ్య‌క్తి క‌థ త‌న‌దే అన‌డం ప‌బ్లిసిటీ కోసం చేసేదే త‌ప్ప ఇందులో నిజం లేదు. సినిమా విడుద‌ల కాకుండానే క‌థ త‌న‌ద‌ని ఆయ‌న ఎలా అంటాడు అని మురుగ‌దాస్ ప్ర‌శ్నిస్తున్నాడు. మ‌రి ఈ వివాదం ఎలా స‌మ‌సిపోతుందో చూడాలి.

5483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS