మోహన్ లాల్ సినిమాలకు మస్త్ డిమాండ్

Wed,February 1, 2017 08:42 AM
Munthirivallikal Thalirkkumbol remake in telugu

ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సినిమాలకు మలయాళంలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన మోహన్ లాల్ మలయాళంలో ఆయన నటించిన సినిమాలను ఇప్పుడు తెలుగులో డబ్ చేస్తూ టాలీవుడ్ ఆడియన్స్ చే ప్రశంసలు అందుకుంటున్నాడు. మోహన్ లాల్ నటించిన పులిమురుగన్, ఒప్పం చిత్రాలు తెలుగులో మన్యం పులి, కనుపాప పేరుతో డబ్ అయ్యాయి. కనుపాప చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ కి రెడీ అయింది. ఇక మోహన్ లాల్ -మీనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ముంతిరివల్లికల్ తలిర్కుంబోల్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పెళ్ళైన 20ఏళ్ళ తర్వాత భార్య భర్తల మధ్య జరిగే రొమాన్స్ నేపథ్యంలో రూపొందింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో టాప్ హీరోతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే రీమేక్స్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని వార్తలు వస్తోండగా, త్వరలోనే ఈ చిత్ర రీమేక్ విషయంపై ఓ క్లారిటీ రానుంది. ‘ముంతిరివల్లికల్ తలిర్కుంబోల్’ చిత్రం కేరళలో భారీ బిజినెస్ జరుపుకోవడంతో పాటు క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. అందుకే ఈ చిత్రంపై భారీ హోప్స్ పెరిగాయి.

1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles