15 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'మున్నాభాయ్ ఎంబీబీఎస్‌'

Wed,December 19, 2018 01:24 PM
Munna Bhai MBBS completes 15 years

సంజ‌య్ ద‌త్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్‌. డిసెంబ‌ర్ 19,2003న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించాడు. చిత్రంలో కామెడీతో పాటు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం తెలుగులో శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో విడుద‌లై బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. హిందీకి అనువాదంగా రూపొందిన చిత్రంగా కాకుండా తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు జ‌యంత్ సీ. ప‌రాన్జీ చిత్రాన్ని రీమేక్ చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రం నేటితో 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన సంజ‌య్ ద‌త్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఆనందం వ్య‌క్తం చేశాడు. 15 ఏళ్ళ క్రితం వ‌చ్చిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రం ఎన్నో జ్ఞాప‌కాల‌ని మిగిల్చింది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని ట్వీట్‌లో తెలిపారు. సునీల్ ద‌త్- సంజ‌య్ ద‌త్ క‌లిసి న‌టించిన తొలి చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రం కావ‌డం విశేషం. చిత్రంలో గ్రేసీ సింగ్‌, అర్ష‌ద్ వ‌ర్సీ, సునీల్ ద‌త్‌, జిమ్మి షేర్‌గిల్‌, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అను మాలిక్ సంగీతం అందించ‌గా, సంజ‌య్ వాండేర్క‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.


1709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles