'సిల్లీ ఫెలోస్' గా సునీల్, అల్లరి నరేష్

Fri,June 8, 2018 05:29 PM
Multi Starrer movie title fixed

కామెడీ హీరోస్ అల్లరి నరేష్, సునీల్ కథానాయకులుగా ఓ మల్టీ స్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హీరోయిజంతో పాటు కామెడీని కలగలిపి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమా అంటే ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది. నరేష్ తో సుడిగాడు అనే చిత్రాన్ని తీసిన భీమినేని శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ డీల్ చేయబోతున్నాడు. సుడిగాడికి సీక్వెల్ గా సుడిగాళ్ళు టైటిల్ తో తమిళ మూవీ 'తమీజ్ పదం 2.0' చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీ స్టారర్ సినిమాకి సిల్లీ ఫెలోస్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అల్లరి నరేష్ ని సునీల్ ని తన వీపుపై ఎక్కించుకున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. చిత్రంలో కథానాయికలుగా రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠిలని తీసుకోవాలని భావిస్తున్నారట. వారు కాదంట వేరే వారిని అప్రోచ్ అయ్యేందుకు కూడా టీం సంసిద్ధంగా ఉందని టాక్. గతంలో అల్లరి నరేశ్ .. సునీల్ కాంబినేషన్లో 'తొట్టి గ్యాంగ్' సినిమా వచ్చింది. ఆ సినిమాలో అల్లరి నరేశ్ హీరో అయితే .. సునీల్ కమెడియన్గా నటించిన విషయం విదితమే.

2442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles