సాయిధ‌ర‌మ్,వ‌రుణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అల్లు అర‌వింద్ చిత్రం!

Tue,December 3, 2019 12:18 PM

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. సీనియ‌ర్ హీరోలు కుర్ర హీరోల‌తో సినిమాలు చేయ‌డం లేదంటే ఒకే వ‌య‌స్సు హీరోలు మంచి సబ్జెక్ట్ ఉన్న క‌థాంశాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఇద్ద‌రు మెగా హీరోల‌తో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అతి త్వ‌రలోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని, కాక‌పోతే సెట్స్ పైకి వెళ్ళ‌డానికి చాలా టైం ప‌డుతుంద‌ని ఇన్‌సైడ్ టాక్.


సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ప్ర‌తి రోజూ పండ‌గే చిత్రం డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సోలో బ్రతుకే సో బెటర్‌ అనే పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు తేజూ. ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇక వ‌రుణ్ తేజ్ కొద్ది రోజులుగా బాక్స‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఇందులో క‌థానాయిక‌లు ఎవ‌ర‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే వ‌రుణ్‌, సాయిధ‌ర‌మ్ చేస్తున్న ప్ర‌స్తుత ప్రాజెక్టుల షూటింగ్ పూర్తైన వెంట‌నే అల్లు అర‌వింద్ ఇద్ద‌రు మెగా హీరోల‌తో క‌లిసి సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles