మజ్ను నుండి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ వీడియో విడుద‌ల‌

Fri,December 14, 2018 10:03 AM
Mr Majnu  Yemainado Lyric Video released

అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ ప్రస్తుతం తన మూడో చిత్రం మజ్నుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మూడో సినిమాని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాడు. తొలి ప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతుంది. ఒక్క‌ పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తైన‌ట్టు తెలుస్తుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేసి జ‌న‌వ‌రి 25న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేశారు. తాజాగా నువ్వెటో..నేనెటో..మనసెటో అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేశారు. ఇందులో అఖిల్, నిధి ఒకరినొకరు మిస్సవుతున్నట్లుగా కనిపించారు. థమన్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చిత్రం నిర్మితమవుతుంది. ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది. వెంకీ అట్లారీ దర్శకత్వం వహించిన తొలిప్రేమ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో ఇప్పుడు తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా మంచి విజయం సాదిస్తుందని టీం భావిస్తుంది.

1105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles