యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న మిస్ట‌ర్ మ‌జ్ను టైటిల్ సాంగ్‌

Wed,December 26, 2018 08:08 AM
Mr. Majnu Title Track Lyric Video

అక్కినేని అఖిల్ ప్ర‌ధాన పాత్ర‌లో తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న చిత్రం మిస్ట‌ర్ మజ్ను. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఇటీవ‌ల ఏమైన‌దో.. అంటూ సాగే ఓ పాట విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజ‌గా టైటిల్ సాంగ్ విడుద‌ల చేశారు. దేవదాసు మనవడో.. మన్మధుడికి వారసుడో..’ అంటూ సాగే ఈ పాట యూత్‌కి బాగా క‌నెక్ట్ అయింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. సాంగ్ మ‌ధ్య‌లో అఖిల్‌తో రామ్ చ‌ర‌ణ్ ఉండ‌డం కూడా చూపించారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రమ్య ఎన్.ఎస్.కె ఆలపించారు. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఈ పాట చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఈ చిత్రంలో క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం థ‌మ‌న్ అందిస్తున్నారు.

3261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles