కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ 'మిస్ట‌ర్ లోక‌ల్' టీజ‌ర్ విడుద‌ల‌

Sun,February 17, 2019 12:18 PM

శివ‌కార్తికేయ‌న్, న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కించిన చిత్రం మిస్ట‌ర్ లోక‌ల్‌. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందుతుంద‌ని తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. ఈ రోజు శివ‌కార్తికేయ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో శివ కార్తికేయ‌న్ మ‌నోహార్ పాత్ర పోషించ‌గా, న‌య‌న‌తార ..కేవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీఈవో కీర్తన వాసుదేవన్‌గా న‌టించింది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కాస్త ఫ‌న్నీగా ఉండ‌గా, అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిత్రానికి హిప్‌హాప్ సంగీతం అందిస్తున్నారు. శివ కార్తికేయన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రిమది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’ చిత్రంలో జంటగా నటించారు.


1857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles