బెంగాలీ ఎంపీల కలర్ ఫుల్ డ్యాన్స్..వీడియో

Fri,September 20, 2019 02:03 PM


కోల్ కతా: దేశవ్యాప్తంగా వచ్చే నెలలో దుర్గామాత ఉత్సవాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బెంగాలీ సినీ నటులు, ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి తో ప్రత్యేక పాటను రూపొందించారు. దుర్గామాతను కొలుస్తూ బెంగాలీ భాషలో రూపొందించిన ‘ఆశే మా దుర్గా శే’ పాటకు ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చకవ్రర్తి నృత్యం చేశారు. బెంగాలీ నటి సుభశ్రీ గంగూలీ కూడా నుస్రత్, మిమీలతో కలిసి ఈ వీడియో సాంగ్ లో కనిపించింది. దుర్గామాత పూజా సాంగ్-2019 పేరుతో కెప్టెన్ టీఎంటీ ఈ పాటను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. సోమవారం ఈ వీడియోను షేర్ చేయగా 1.6 మిలియన్ల మందికిపైగా ఈ వీడియో సాంగ్ ను వీక్షించారు.

3054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles