‘కోనాపురంలో జరిగిన కథ’ ట్రైలర్ విడుదల

Mon,October 21, 2019 05:37 PM


కే బి కృష్ణ దర్శకత్వంలో అనిల్ మొగిలి హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. ఈ సినిమా పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనూష సినిమా బ్యానర్ లో బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.


ఈ సినిమా నిర్మాతలు, హీరో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం నుండి తొలి హీరోగా, తొలి సినిమాగా వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఈ సినిమాను ఆదరించాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. సినిమా మంచి సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో కూడి ఉందని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు. గజ్వేల్ నుండి తొలి హీరోగా వస్తున్న అనిల్ మొగిలిని ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. ఈ చిత్రంలో సునీత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో అనిల్ మొగిలి, నిర్మాతలు బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్ రెడ్డి ,దర్శకుడు కె బి కృష్ణ , చిత్ర సహాయకులుదుంబాల లింగారెడ్డి, మహాదేవుని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సినిమా నవంబర్ 1న విడుదలవుతున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. దర్శకుడు కేబీ కృష్ణ వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందినవారు.

691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles