'మా' అధ్యక్షుడిగా నరేష్ విజయం

Mon,March 11, 2019 06:58 AM
movie artists association results declared

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించారు. 'మా' అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించారు. శివాజీ రాజా, నరేష్ ప్యానెల్స్ గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడిన సంగతి తెలిసిందే. ఫిలిం చాంబర్‌లో నిన్న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు ఇతర మూవీ అసోసియేషన్ సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. మా ఫలితాలు సాయంత్రం వరకు ప్రకటిస్తారనుకుంటే.. రాత్రి వరకు కూడా ప్రకటించలేదు. తాజాగా మా ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.

గెలిచిన వాళ్లు వీళ్లే..


'మా' అధ్యక్షుడు - నరేష్
'మా' ఉపాధ్యక్షులు - ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ(హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు)
కోశాధికారి-రాజీవ్ కనకాల
జనరల్ సెక్రటరీ- జీవిత రాజశేఖర్
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - రాజశేఖర్

5857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles