మదర్‌ థెరీసా బ‌యోపిక్.. వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు

Tue,March 12, 2019 08:39 AM

బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల‌కి బ్రేక్ ప‌డ‌డం లేదు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖుల జీవితాల‌కి సంబంధించి ప‌లు చిత్రాలు సెట్స్ పై ఉండ‌గానే, మేక‌ర్స్ మ‌రో మ‌హోన్న‌త వ్య‌క్తి యెక్క బ‌యోపిక్ తెర‌కెక్కించనున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. సేవే మార్గం అన్న చందాన జీవిత‌మంతా ప్ర‌జ‌ల సేవ‌ల కోస‌మే బ్ర‌తికిన మ‌ద‌ర్ థెరీసా జీవిత నేప‌థ్యంలో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని సీమా ఉపాధ్యాయే తెర‌కెక్కించ‌నున్నారు. నిర్మాతలు ప్రదీప్ శర్మ, నితిన్ మన్మోహన్, గిరీష్ జోహర్, ప్రాచీ మన్మోహన్ సంయుక్తంగా ‘మదర్ థెరీసా : ది సెయింట్’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సీమా ఉపాధ్యాయే ‘మదర్ థెరీసా : ది సెయింట్’ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఆధారంగానే సినిమా తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.


2020లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మ‌ధ‌ర్ థెరీసా పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు ఉండనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులలో ప్రాజెక్ట్‌ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ బయోపిక్‌కు మొదలు పెట్టాలని అనుకోగానే ముందు కోల్‌కతాలోని చారిటీకి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నాం అని ద‌ర్శ‌కురాలు అన్నారు. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టిన మదర్ థెరిసా, ఇండియా వచ్చి.. కోల్‌కతా ప్రాంతంలో అనాధ శరణాలయాన్ని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఆ శరణాలయం ద్వారా లక్షలాది మందిని చేరదీసి అమ్మగా మారారు. ఆమె సేవలకు ప్రతిఫలంగా నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.

1084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles