రాజ‌మౌళి మ‌ల్టీస్టారర్ మూవీ డీటైల్స్‌..!

Wed,November 22, 2017 11:41 AM
more details about rajamouli multi starrer

ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి ఇటు నంద‌మూరి హీరో ఎన్టీఆర్ అటు మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ల్టీ స్టార‌ర్‌కి సంబంధించి కొన్ని డీటైల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. 150 కోట్ల బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్నాడ‌ని, ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల‌లోను రిలీజ్ చేస్తార‌ని టాక్ న‌డుస్తుంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ 2018 స‌మ్మ‌ర్ నుండి మొద‌ల‌వుతుంద‌ట‌. 2019 ద్వితీయార్ధంలో మూవీని రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం. రాజ‌మౌళి త్వ‌ర‌లో డీవీవీ దాన‌య్య నిర్మాణంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ మూవీ త‌ర్వాత మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. దీని త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రాన్ని చేస్తాడు. ఈ చిత్రం కెఎల్ నారాయణ నిర్మాణంలో రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం ఎన్టీఆర్ .. త్రివిక్ర‌మ్ మూవీ కోసం రెడీ అవుతుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం 1985 చిత్రంతో బిజీగా ఉన్నాడు.

6814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS