శ్రీదేవి ‘మామ్’ పోస్టర్ వచ్చేసింది

Tue,March 14, 2017 10:35 AM

కొన్ని సినిమాలు సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెళ్లిపోతుంటాయి. సినిమా ఎప్పుడు మొదలైందో ఎప్పుడు పూర్తైందో కూడా ఎవరికీ తెలియదు. తాజాగా నిన్నటి హీరోయిన్ శ్రీదేవి నటించిన బాలీవుడ్ సినిమా చడీ చప్పుడు కాకుండా పూర్తయిందట. శ్రీదేవి మెయిన్ రోల్ గా ఉండే పిక్చర్ మామ్ ని ఎప్పుడో స్టార్ట్ చేశాడు బోనీకపూర్. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందట. తాజాగా చిత్ర పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ పై వివిధ భాషలతో రాసి ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. పోస్టర్ ద్వారా మామ్ చిత్రాన్ని జూలై 14,2017న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రవి ఉద్యావర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు పాకిస్థానీ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకరు శ్రీదేవి భర్త పాత్ర చేస్తున్న అద్నాన సిద్దిఖి, మరొకరు ఆమె కూతురిగా నటిస్తున్న సజల్‌ అలీ. శ్రీదేవి 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వగా ఈ మూవీ ఆడియన్స్ ని అంతగా తృప్తి పరచలేదు. ఆ తర్వాత కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన పులి చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక తన తాజా చిత్రం మామ్ తో అభిమానులను మరింత సంతృప్తి పరచాలని శ్రీదేవి భావిస్తుంది. చూడాలి మరి ఈ అతిలోక సుందరి మామ్ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో

1679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles