త్వరలో మోహన్‌లాల్ ‘కనుపాప’

Wed,January 11, 2017 09:47 PM


హైదరాబాద్: జనతాగ్యారేజ్ మూవీ సక్సెస్‌తో టాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నాడు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. తాజాగా మోహన్‌లాల్ కనుపాప మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఒప్పం’ ను తెలుగులో కనుపాప పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఆడియోను జనవరి 25న విడుదల చేసి, ఫిబ్రవరి 3న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మోహన్‌లాల్, జగపతిబాబు, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన మన్యంపులి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

802

More News

మరిన్ని వార్తలు...