స‌రికొత్త లుక్‌లో మోహ‌న్ లాల్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

Sun,May 19, 2019 07:04 AM
mohan lal new look photo goes viral

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్ జోరు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. కుర్ర హీరోల‌కి పోటీగా వ‌రుస సినిమాలు చేస్తున్న మోహ‌న్ లాల్ తాజాగా ‘ఇట్టిమాని: మేడ్‌ ఇన్‌ చైనా’ అనే చిత్రం చేస్తున్నారు. జిబి అండ్‌ జోజు ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో మోహ‌న్ లాల్ డ్యాన్స‌ర్‌గా స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నారు. పురాతన క్రిస్టియన్ నృత్యాల‌లో ఒకటైన ‘మార్‌క్కంగళి’ డ్యాన్స్‌ చేసే త్రిసూర్‌ ప్రాంత వాస్తవ్యుడిగా మోహన్‌లాల్‌ పాత్ర ఉంటుందని మాలీవుడ్‌ టాక్‌. గ‌త నెల‌లో ప్రారంభ‌మైన ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ త్రిసూర్‌లో జరగనుంది. కొన్ని సన్నివేశాలను సింగపూర్‌లో ప్లాన్‌ చేశారట టీమ్‌. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. మ‌రోవైపు సిద్ధిఖీ ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ బ్ర‌ద‌ర్ అనే సినిమా చేయ‌నున్నాడు మోహ‌న్ లాల్. ఇందులో స‌ల్మాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

1349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles