ఆస్కార్ కి నామినేట్‌ అయిన మెగాస్టార్ సినిమా పాటలు

Tue,December 19, 2017 05:28 PM
mohan lal movie reaches great feet

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ పులిమురుగన్. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు. దసరాకి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టించింది. ఈ చిత్రం తెలుగులోను మన్యం పులి టైటిల్ తో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో 3డీ, 6డీ ఫార్మాట్ లోను చిత్రాన్ని విడుదల చేశారు. 6డీ వెర్షన్లో విడుదలైన తొలి భారతదేశ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

పులిమురుగన్ చిత్రం వంద కోట్లకి పైగా వసూళ్ళు సాధించడంతో పాటు పలు అవార్డులని అందుకుంది. మోహన్ లాల్ ఈ చిత్రానికి గాను కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు. పీటర్ హెయిన్స్ బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి మరో ఘనత దక్కింది. గోపి సుందర్ సంగీతంలో రూపొందిన ‘కాదనయుం..’, ‘మానతే..’ అనే రెండు పాటలు ఉత్తమ పాటల విభాగంలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యాయి. దీంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తుంది.

2929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles