ఎస్వీఆర్ పాత్ర‌లో మోహ‌న్ బాబు

Sat,September 16, 2017 12:18 PM
Mohan Babu To Play SV Ranga Rao role in biopic

అలనాటి మహానటి సావిత్రి అయితే, నాటి మేటి మహానటుడు ఎస్వీ రంగారావు. ఆయన ఏ పాత్ర వేసినా అది ఆయన నటనకే తలమానికంగా నిలిచింది. ఎస్వీ రంగారావు తెరపై కనిపిస్తే హీరోలు సైతం వెలవెలపోయారంటే అతిశయోక్తి కాదు. ఆయన చిరస్మరణీయుడు. ఇప్పుడు ‘మహానటి’ చిత్రం ద్వారా ఆయనను మరోసారి గుర్తుచేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ సినిమాలో స్వర్గీయ రంగారావు పాత్రను వేయడానికి మోహన్ బాబును సెలెక్ట్ చేసారని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి .

ఎస్వీ రంగారావు పేరు తలుచుకోగానే గంభీరమైన ఆయన రూపం, అనర్గళమైన ఆయన సంభాషణలు గుర్తుకొస్తాయి. ఎన్ని తరాలు గడిచినా అలాంటి నటుడు మళ్లీరాకపోవచ్చని అంటారు. ఆ మహానటుడు లేకపోయినా మహానటి సినిమాలో మోహ‌న్ బాబుని ఎస్వీ రంగారావుగా మనముందుకు తీసుకురాబోతున్నారు మేక‌ర్స్‌. అయితే ఇన్నాళ్ళు దీనిపై ఎలాంటి క్లారిటీ రాక‌పోగా, తాజాగా మంచు ల‌క్ష్మీ చేసిన రీ ట్వీట్ మోహ‌న్ బాబు మ‌హాన‌టిలో న‌టించ‌నున్నాడ‌నే విష‌యం చెప్ప‌క‌నే చెబుతుంది. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ క‌నిపించ‌నుండ‌గా, దుల్కర్ సల్మాన్, సమంత, ప్రకాష్ రాజ్, షాలిని పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సావిత్రి జీవితంలో కీలక వ్య‌క్తులైన‌ ఎన్టీ రామారావు, అక్కినేని పాత్రలకోసం జూనియర్ ఎన్టీఆర్ ను, నాగచైతన్య ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.


813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles