సంచ‌ల‌నం రేపుతున్న మోహ‌న్ బాబు వ్యాఖ్య‌లు

Sat,January 20, 2018 10:17 AM
Mohan Babu sensational comments

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు రాజకీయ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌ 2018 భాగంగా ‘ఫాదర్‌ టు డాటర్‌: ది డీఎన్‌ఏ ఆఫ్‌ యాక్టింగ్‌’ పేరుతో జరిగిన సెషన్‌లో తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి పాల్గొన్నారు మోహ‌న్ బాబు. ఈ సెష‌న‌ల్ లో మంచు లక్ష్మి మోహన్ బాబు చెప్పిన డైలాగులను ఇంగ్లీష్ లో అనువాదించింది. సినిమాలు, రాజ‌కీయాల‌కి సంబంధించి మాట్లాడిన మోహ‌న్ బాబు 95 శాతం పొలిటీషియ‌న్ రాస్కెల్స్ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. స్నేహితుడు, అన్న అయిన ఎన్టీఆర్ మాత్రం నిస్వార్ధంగా ప‌ని చేశార‌ని, ఆయ‌నికి లంచం అంటే కూడా తెలియ‌ద‌న్న‌నారు. ఆయ‌న నన్ను రాజ్య‌స‌భ‌కి పంపారు. ఎలాంటి మ‌చ్చ లేకుండా ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకున్నాను. ఇప్పటి రాజ‌కీయ‌నాయ‌కులు ప్ర‌జ‌ల‌కి హామీలిస్తున్నారు. కాని నిల‌బెట్టుకునేవారెవ‌రు, వారు ఇచ్చిన మాట‌కి క‌ట్టుబ‌డి ఉంటే ఇండియా ఇంకా మంచి స్థానంలో ఉండేద‌ని మోహ‌న్ బాబు పేర్కొన్నారు. ఇక మీరు ఎంతో మంది సీనియర్ నటులతో నటించి ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా నటిస్తున్నారు అని అడ‌గ‌గా.. కుర్ర హీరోలతో నేను నటించడం ఏంటి వాళ్లే నాతో నటించారు అని కౌంటర్ వేశారు మోహ‌న్ బాబు. తాను కేవలం సీనియర్ హీరోలతో నటించాను అని చెప్పారు. నిప్పు కాల్చేస్తుంది. నీరు ముంచేస్తుంది. గాలి లేపేస్తుంది.ఆకాశం పిడుగు వేస్తుంది.భూమి పాతేసుకుంటుంది. ప్రాణమిచ్చే పంచ భూతాలే ప్రాణం తీస్తుంటే నువ్వెంతరా అని మోహ‌న్ బాబు చెప్పిన‌ డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇదే డైలాగ్ మంచు ల‌క్ష్మీ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి వినిపించడం విశేషం.

3031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles