మిత్రుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్న మోహన్‌బాబు

Sun,September 4, 2016 07:55 AM
Mohan babu meets Rajnikanth

ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్ మరొకరు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. ఇద్దరు స్టార్లే. వీరిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సేవా కార్యక్రమాలతోను ఈ ఇద్దరు ఎందరో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఏళ్ళ తరబడి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. వీరి స్నేహం భావి తరాలకు ఆదర్శం. వారి వారి కార్యకలాపాలతో వీరిద్దరు ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉంటారు.రజినీకాంత్‌పై ఇటీవల కొన్ని రూమర్లు చక్కర్లు కొట్టాయి. తన ఆరోగ్యం బాగోలేదని అందుకే అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకున్నాడని వార్తలు వచ్చాయి. వీటన్నింటిని తిప్పి కొడుతూ తన మిత్రుడు కింగ్‌లా ఉన్నాడంటూ స్టన్నింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు మోహన్ బాబు. తాజాగా తన చిరకాల మిత్రుడు రజినీ ఇంటికి వెళ్ళిన మోహన్ బాబు తలైవా ఫ్యామిలీతో కొద్ది సేపు గడిపి క్షేమ సమాచారాలను తెలుసుకున్నాడు. ఆ తర్వాత రజినీకు సంబంధించి కొన్ని ట్వీట్స్ చేశాడు ఈ కలెక్షన్ కింగ్. ఈ కలియుగంలో రజినీ ధుర్యోధనుడైతే తాను కర్ణుడినంటూ తెలిపాడు. ఇక రజినీ విజయం వెనుక తన సోదరి లతా రజినీకాంత్ కృషి ఎంతో ఉందని తాను బలంగా నమ్ముతున్నట్టు ట్వీట్ చేశాడు. ఈ ఆత్మీయ పలకరింపును చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.4074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles