ఇంట్రస్టింగ్ గా మోహన్‌బాబు ‘గాయత్రి’ ఫస్ట్ లుక్

Mon,December 25, 2017 05:40 PM
Mohan babu gayatri first Look Revealed today


హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు లీడ్‌రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాయత్రి. శ్రియా శరణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మదన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను క్రిస్మస్ కానుకగా చిత్రయూనిట్ విడుదల చేసింది. పస్ట్ లుక్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు కలెక్షన్ కింగ్. పస్ట్ లుక్‌ పోస్టర్ లో ‘ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే’.. అనే డైలాగ్ పక్కనే సీరియస్ లుక్‌లో ఉన్న మోహన్‌బాబు స్టిల్ కనిపిస్తుంది. గాయత్రి సినిమాలో మోహన్‌బాబు హీరోగా, విలన్‌గా రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. తాజాగా రిలీజైన పోస్టర్ మోహన్‌బాబు నెగెటివ్ రోల్‌కు సంబంధించినదని అర్థమవుతున్నది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్నాడు. 2018 ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

2183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS