శ్రీవారిని దర్శించుకున్న మోహన్‌బాబు ఫ్యామిలీ, రకుల్

Sun,March 18, 2018 01:21 PM
Mohan Babu family and rakul preet singh visits tirumala

తిరుమల : శ్రీ విళంబి నామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున మంచు మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్వామివారిని దర్శించుకుంది. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరు స్వామివారి మూలవిరాట్టును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. మోహన్ బాబు మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం రోజున స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

3532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS