43 ఏళ్ల సినీ ప్ర‌యాణం పూర్తి చేసుకున్న మోహ‌న్ బాబు

Thu,November 22, 2018 12:30 PM
Mohan Babu completes 43 years in industry

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు రూటే స‌ప‌రేటు. ఆయ‌న మాట‌ల్లో గాంభీర్యం, డైలాగులకు అనుగుణంగా హావభావాలు , యాక్టింగ్ లో అదరగొట్టడం మోహ‌న్ బాబు సొంతం. విల‌న్‌గా, నటుడిగా విభిన్న పాత్ర‌లు పోషించిన మోహ‌న్ బాబు 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఇప్ప‌టికి అడ‌పాద‌డపా పాత్ర‌ల‌లో క‌నిపిస్తూనే ఉన్నాడు. అయితే ఆయ‌న నేటితో త‌న 43 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. 1975 న‌వంబ‌ర్ 22న విడుద‌లైన స్వ‌ర్గం న‌ర‌కం అనే సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయ్యారు మోహ‌న్ బాబు. ఈ చిత్రాన్ని దాస‌రి నారాయ‌ణ రావు తెర‌కెక్కించారు.

కెరీర్ మొద‌ట్లోనే దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందిన మోహ‌న్ బాబు అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఆర్ట్ పిక్చర్స్ అనే బేన‌ర్‌ని స్థాపించాడు. ఈ బేన‌ర్‌పై ప‌లు హిట్ సినిమాలు చేశాడు . మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సినీ ప‌రిశ్రమ‌లో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్నో అవార్డులు అందుకున్నారు. క‌ళామ్మ త‌ల్లి ముద్దుబిడ్డ‌గా ఉన్న మోహ‌న్ బాబు 43 సంవ‌త్స‌రాల సినీ ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయి. అరుదైన ఘ‌న‌త సాధించిన మోహ‌న్ బాబుకి ప‌లువురు సెల‌బ్రిటీలు, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మీ త‌న ట్విట్ట‌ర్‌లో తండ్రికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ ..‘సినీ పరిశ్రమలో 43 ఏళ్ల పాటు కొనసాగడం నిజంగా గొప్ప ప్రయాణం. ఈ అద్భుతాన్ని సాధించిన కలెక్షన్ కింగ్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నాన్న.. అభినందనలు’ అని #43YearsOfMB హ్యాగ్ ట్యాగ్ తో ట్వీట్ చేసింది.1806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles