మలేషియాలో మిస్టర్ కేకే విడుదలపై నిషేధం..!

Sun,July 21, 2019 07:44 PM
Mister kk release banned in malaysia


కౌలాలంపూర్ : కోలీవుడ్ హీరో విక్రమ్‌ నటించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ కేకే’. రాజేష్‌ ఎమ్‌ సెల్వ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో ‘కడరం కొండాన్’ టైటిల్‌తో విడుదలైంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన మిస్టర్ కేకే మూవీకి మలేషియాలో చుక్కెదురైంది. మిస్టర్ కేకే చిత్రంలో మలేషియా పోలీసులు, సమాజాన్ని నెగెటివ్ కోణంలో చూపించినట్లు అక్కడి సెన్సార్ బోర్డు పేర్కొంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన మలేషియా సెన్సార్ బోర్డు మలేషియాలో చిత్రం విడుదలపై నిషేధం విధించింది. దీంతో విక్రమ్ అభిమానులు సింగపూర్ కు వెళ్లి మరీ సినిమాను చూస్తున్నారట.

1446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles