మెగా హీరో స‌ర‌స‌న డ‌బ్ స్మాష్ భామ‌..!

Sat,February 2, 2019 12:35 PM
Mirnalini Ravi pair with varun tej

డ‌బ్ స్మాష్‌తో రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ స్టేట‌స్ అందుకున్నవారు ఎంద‌రో ఉన్నారు. వారిలో కొంద‌రిని అదృష్టం వ‌రించి వెండితెర‌పై క‌నిపించే ఛాన్స్ కూడా అందుకున్నారు. ఈ కోవ‌లో మృణాలినీ రవి కూడా చేరింది. త‌మిళ నాట డ‌బ్ స్మాష్‌తో ప‌లు వీడియోలు చేసిన మ‌ణాలినీ.. మెగా హీరో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న జ‌త‌క‌ట్టే ఛాన్స్ అందుకుంద‌ట‌. దీనిపై చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల ఎఫ్ 2 చిత్రంతో అల‌రించిన‌ వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లో త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ‌ని రీమేక్ చేయ‌నున్నాడు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించ‌నుంది. ఇందులో నాగ శౌర్య కూడా ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. తెలుగు నేటీవిటికి త‌గ్గ‌ట్టుగా హ‌రీష్ శంక‌ర్ స్క్రిప్ట్‌ని సిద్దం చేసుకోగా వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌.

5615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles