జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో ఎంజీఆర్ లుక్ ఔట్..!

Thu,November 14, 2019 11:15 AM

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో ప‌లు చిత్రాలు తెర‌కెక్కుతుండ‌గా, కొన్ని ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ..‘శశి లలిత’ పేరిట ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఇందులో జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఎం జరిగింది అనేది చూపించబోతున్నారు. మరోవైపు జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీన‌న్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇక త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ తాను త‌లైవీ అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్నాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇందులో కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది.


దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్‌తో త‌లైవీ చిత్రం తెర‌కెక్కుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో కంగ‌నా నాలుగు పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక జ‌య‌ల‌లిత జీవితంలో ముఖ్య‌మైన వ్య‌క్తి ఎంజీఆర్. ఆయ‌న పాత్ర‌లో కోలీవుడ్ మ‌న్మ‌థుడు అర‌వింద్ స్వామి క‌నిపించ‌నున్నారు. ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద్ లుక్ తాజాగా విడుద‌లైంది. షూట్‌లో పాల్గొనే ముందు అర‌వింద్ స్వామి ఫోటోకి ఫోజిచ్చారు. ఆ పిక్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. క్లీన్ షేవ్ చేసుకొని పూర్తి గ్లామర్ లుక్‌లో ఉన్న అర‌వింద్ స్వామి ఫోటో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles