'హ‌లో' ఫుల్ వెడ్డింగ్ సాంగ్ విడుద‌ల‌

Fri,December 8, 2017 11:36 AM
Merise Merise Lyrical song released

డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న హ‌లో సినిమాకి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఒక‌వైపు నాగ్ ప్రెస్‌మీట్స్‌తో సినిమాకి ప్ర‌మోష‌న్స్ చేస్తుంటే, అఖిల్ త‌న స్టైల్‌లో అభిమానుల‌లో అంచ‌నాలు పెంచుతున్నాడు. ఇక ఈ మధ్యే టీజర్, ట్రైలర్ తో అలరించిన హలో చిత్ర యూనిట్ తాజాగా హలో వెడ్డింగ్ ప్రోమో సాంగ్ విడుదల చేసింది. ఈ సాంగ్ కలర్ ఫుల్ గా ఉండటంతో పాటు అభిమానులని ఎంతగానో అలరించింది. అయితే తాజాగా మెరిసే మెరిసే(వెడ్డింగ్ సాంగ్‌) అంటూ సాగే పాట లిరిక‌ల్ సాంగ్ పూర్తిగా విడుదల చేశారు. హ‌రిచ‌ర‌ణ్‌, శ్రీనిధి వెంక‌టేష్‌, శృతి రంజ‌నీ పాడిన పాట సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. ఈ సాంగ్‌ని బ‌ట్టి చూస్తుంటే అనూప్ మరోసారి తనదైన స్టైల్ లో బాణీలు అందించాడని అర్ధ‌మ‌వుతుంది. ఇక త్వరలో రానా, అఖిల్ లు యూఎస్ కి సినిమా ప్రమోషన్ కోసం వెళ్లనున్నారు. విక్రమ్ కుమార్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన మెరిసే మెరిసే సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

2029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles