కొత్త ప్రయోగం ఫలించేనా?

Tue,April 4, 2017 09:09 AM
Meri Pyaari Bindu chapter 1 trailer

బాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. రొటీన్ కి భిన్నంగా తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మేరి ప్యారి బింధు చిత్ర టీం చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే వావ్ అనాల్సిందే. ఒకప్పుడు సినిమా రిలీజ్ వరకు ఎలాంటి వీడియోని విడుదల చేసేందుకు ముందుకు రాని దర్శక నిర్మాతలు ఇప్పుడు ట్రైలర్, టీజర్, ప్రీ టీజర్, సాంగ్స్ ఇలా పలు రకాల వీడియోలు విడుదల చేస్తూ అభిమానులలో సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మేరి ప్యారి బింధు చిత్ర టీం తమ సినిమాకు సంబంధించి 5 చాప్టర్ల ట్రైలర్స్ రిలీజ్ చేయనుందట. మొదటిగా ఓ ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ నాలుగు రోజులలో మరో నాలుగు ట్రైలర్స్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ 5 చాప్టర్ల ట్రైలర్స్ 1990ల నాటి బ్యాక్ డ్రాప్ నుండి.. నేటి 2017 బ్యాక్ డ్రాప్ వరకు జరిగిన అంశాలను వివరిస్తుందట. అక్షయ్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అయుష్మాన్ ఖురానా హీరోగా కనిపించనుండగా ,పరిణీతి చోప్రా మెయిన్ లీడ్ గా నటిస్తుంది. మే 12న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకు రానున్నారు. మరి తాజాగా విడుదలైన చాప్టర్ 1 ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS