బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ గల్లీ భాయ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జోయా అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలోని రెండో పాట మేరీ గల్లీ మే వీడియోను రణ్ వీర్ షేర్ చేశాడు. మేరీ గల్లీ మే అంటూ సాగే పాటలో రణ్ వీర్, సిద్దాంత్ చతుర్వేది తమ స్టెప్పులతో అందరినీ అలరిస్తున్నారు. ముంబై ర్యాపర్ డివైన్ రూపొందించిన మేరీ గల్లీ మే మ్యూజిక్ ను రీమిక్స్ చేస్తూ ఈ పాటను పాడారు. మాతృక పాటకు ఏ మాత్రం తగ్గకుండా ముంబై గల్లీలో తీసిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.