ఒక్క డైలాగ్ లేదు.. కాని ఆక‌ట్టుకుంది- ట్రైల‌ర్

Tue,April 10, 2018 08:39 AM
Mercury   Official Trailer

క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో సింగీతం శ్రీనివాస‌రావు తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌క విమానం . ఇందులోని పాత్ర‌లకి మాట‌ల్లేకుండా కేవ‌లం భావాల‌తోనే ఆడియ‌న్స్‌ని ర‌క్తి క‌ట్టించారు. ఇప్పుడు అదే స్టైల్‌లో ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా మెర్క్యురీ అనే సినిమా చేసాడు. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందింది. సైలెంట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్ర ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌ల అయింది. ఇందులో ఒక్క డైలాగ్ లేక‌పోయిన స‌న్నివేశాలు మాత్రం ఆడియ‌న్స్‌లో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. సస్పెన్స్, థ్రిల్లింగ్ తోనే ఈ మూవీ ప్రేక్షకులని అల‌రిస్తుంద‌ని అంటున్నారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, పెన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.


3047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles