వివాదంలో 'మెంటల్ హై క్యా' మూవీ టైటిల్

Sat,April 20, 2019 03:28 PM
Mental Hai Kya lands in trouble

ఢిల్లీ: బాలీవుడ్ మూవీ 'మెంటల్ హై క్యా' చిత్రం టైటిల్ వివాదంలో చిక్కింది. ఏక్తా కపూర్ నిర్మాతగా, ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో నటి కంగనా రనౌత్, నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన ప్రాతలుగా మెంటల్ హై క్యా చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. జూన్ 21వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్ర టైటిల్‌పై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ, సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. మానసిక రోగుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా పేరు ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమా పేరును మార్చాలంటూ డిమాండ్ చేసింది. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం మద్దతు తెలిపింది. సృజనాత్మక కొందరిని బాధించేలా ఉండకూడదని సొసైటీ అధ్యక్షుడు మృగేష్ వైష్ణవ అన్నారు.

1132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles