పోటాపోటీగా జ‌రిగిన అంతిమ యుద్ధంలో గెలుపెవ‌రిదో తెలుసా?

Fri,August 10, 2018 09:29 AM
mens win in the task

బిగ్ బాస్ సీజ్‌న్ 2లో గ‌త మూడు రోజులుగా అంతిమ యుద్ధం అనే టాస్క్ పేరుతో మ‌హిళ‌లు పురుషుల మ‌ధ్య ప‌లు టాస్క్‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దాదాపు అన్ని టాస్క్‌ల‌లో పురుషులే పై చేయి సాధించారు. 61వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మ‌హిళ‌ల బ్రెయిన్‌కి ప‌దును పెట్టే టాస్క్ ఇచ్చారు. త‌నీష్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కి టాస్క్‌లో పాల్గొన్న దీప్తి సున‌య‌న‌, శ్యామ‌ల‌, దీప్తిలు స‌మాధానం చెప్పాల్సి ఉండగా శ్యామ‌ల‌, యాంక‌ర్ దీప్తి ఇద్ద‌రు ఎక్కువ ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇచ్చారు. దీప్తి సున‌య‌న ఒక్క ప్ర‌శ్న‌కి కూడా జ‌వాబు ఇవ్వ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత టాస్క్ లో భాగంగా త‌నీష్‌, అమిత్‌లు శాండ్‌విచ్ త‌యారు చేయ‌డంతో పాటు బ‌ట్ట‌లు ఐర‌న్ చేశారు. చ‌పాతీలు రెడీ చేశారు.

ఇక త‌ర్వాత ఎప్పుడు ఆడ‌వాళ్ళు చేసే వంట‌ల‌ని పురుషులు త‌యారు చేయాల‌ని చెప్పిన బిగ్ బాస్, మంచి వంట‌ల‌ని త‌యారు చేసి ఆడ‌వాళ్ళ మెప్పు పొందాల‌ని కోరారు. చిల్లీ చికెన్, ఫిష్ ఫ్రై, ప‌న్నీర్ ప‌కోడా పురుషులు చేయాల‌ని బిగ్ బాస్ చెప్ప‌గా, ఆడ‌వాళ్ళు పురుషుల‌తో వ్యాపార లావాదేవీలు చేయాల‌ని అన్నారు. పురుషులు 45 నిమిషాల‌లో వంట‌ని పూర్తి చేయాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో నిర్ధేశిత స‌మ‌యంలో పురుషులు వంట చేయ‌లేరు టాస్క్‌ని పూర్తి చేయ‌డంతో టాస్క్ విజేత‌లు పురుషులే అని బిగ్ బాస్ నిర్ణ‌యించారు. కౌశ‌ల్ పురుషుల బాత్ రూం వాడ‌కుండా అమ్మాయిల్ బాత్ రూం వాడ‌డంపై పూజా గీతాతో చ‌ర్చించింది. హౌజ్‌లోకి వ‌చ్చిన మొద‌ట్లోను చూసాను, రీసెంట్‌గా చూశాన‌ని పూజా అంది. దీనికి గీతా మాధురి ఈ విషయంలో నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని చెబుతూ గతంలో తేజస్విని కూడా ఇదే కంప్లైంట్‌ చేసిందని చెప్పుకొచ్చింది. ఆ త‌ర్వాత గీతా మాధురి, కౌశ‌ల్ మ‌ధ్య కాసేపు చ‌ర్చ జ‌రిగిన త‌ర్వాత కౌశ‌ల్ అన్న మాట‌ల‌కి గీతా ఫీలై అక్క‌డ నుండి వెనుదిరిగింది.

మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో బిగ్ బాస్ అమ్మాయిల‌కి ఇచ్చిన బిజినెస్ టాస్క్ డీల్ పూర్తి చేయ‌డం కోసం అబ్బాయిల‌ని ఎంట‌ర్‌టైన్ చేసింది శ్యామ‌ల‌. సోది చెబుతానంటూ త‌నీష్‌, సామ్రాట్‌, కౌశ‌ల్‌, బాబు గోగినేని తీరు ఇంట్లో, బ‌య‌ట ఎలా ఉంటుందో సోది రూపంలో వ‌ర్ణించి పురుషుల మెప్పు పొందింది. ఆ త‌ర్వాత దీప్తి న్యూస్ యాంక‌ర్‌గా అల‌రించింది. అయితే అంతిమ యుద్ధం విజేత‌లు ఎవ‌రే నిర్ణ‌యించే టైం ఆస‌న్నం కావ‌డంతో ఇంటి స‌భ్యులు అందరు ఒక చోట చేశారు. పురుషులు, మ‌హిళ‌లు సాధించిన కాయిన్స్ టేబుల్‌పైన పెట్టారు. కౌశ‌ల్ గేమ్ మొదట్లో 40 కాయిన్స్ తీసుకోవ‌డంపై బాబు గోగినేని అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ అలా చేయ‌డం త‌ప్పు అని వాదించాడు. నేను మ‌హిళ‌ల‌కి జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని చెప్పేందుకు ఇలా చేసానంటూ కౌశ‌ల్ బ‌దులిచ్చాడు. కౌశ‌ల్ సోలో గేమ్ ఆడాడని త‌నీష్ అన‌డంతో నేనెప్పుడు అలా భావించలేదు, ఆడ‌లేదు. మ‌హిళ‌ల ద‌గ్గ‌ర నుండి తీసుకున్న కాయిన్స్ వారికే ఇచ్చేస్తున్నాను అంటూ 40 కాయిన్స్‌ని వెనక్కి ఇచ్చేశారు.

కౌశ‌ల్‌పై దొంగ‌త‌నం చేసాడ‌నే అబాండం పూజా, త‌నీష్ , బాబు గోగినేనిలు వేయ‌డంతో కౌశ‌ల్‌కి మ‌హిళ‌ల నుండి మ‌ద్ద‌తు ల‌భించింది. మాటి మాటికీ దొంగతనం చేశారని అనడం కరెక్ట్ కాదంటూ బాబు గోగినేనికి చురకలు అంటించారు దీప్తి. కౌశల్ చేసింది దొంగతనం కిందకు రాదని.. అలా అనుకుంటే వాటర్ బాటిల్, బనానా ఇలా చాలా దొంగతనం చేశారని.. అవన్నీ వదిలేసి కౌశల్‌ని ఒక్కడినే దొంగ అనడం కరెక్ట్ కాదన్నారు. అయితే త‌మ టీంలో స‌ఖ్య‌త లేక‌పోవ‌డం , బిగ్ బాస్ గేమ్ తెలియ‌కుండా ఒక విష‌యం గురించి దారుణం అని మాట్లాడ‌డం బాధ‌గా అనిపించిందని కౌశ‌ల్ అన్నారు. మహిళలు పురుషులతో సమానం అని వాళ్ల గెలివాలని కోరుకుంటూ తన వద్ద ఉన్న 15 గోల్డ్ కాయిన్స్‌ను మహిళకు ఇచ్చారు కౌశల్

చివరిగా ‘అంతిమ యుద్ధం’ అనే హోరా హోరిగా జ‌రిగిన‌ పోరులో మహిళలు 325 కాయిన్స్ సాధించగా.. పురుషులు 330 కాయిన్స్‌తో విజేతలుగా నిలిచారు.మహిళల కంటే ఐదు కాయిన్స్ ఎక్కవ సాధించిన పురుషుల్ని విజేతలుగా ప్రకటించారు బిగ్ బాస్. ఈ ‘అంతిమ యుద్ధం’టాస్క్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన కంటెస్టెంట్స్‌ ఈ వారం కెప్టెన్ అయ్యే అవకాశం ఉండటంతో కెప్టెన్ నామినేషన్ కోసం ఉత్తమ ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన మహిళ, ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన పురుషుడ్ని చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించగా.. పురుషులందరూ కౌశల్‌ని పక్కన పెట్టేసి తనీష్‌కి పట్టం కట్టారు. ఇక మహిళల టీం తరుపున ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన మహిళగా దీప్తి నిలిచింది.

కెప్టెన్సీ టాస్క్ కోసం దీప్తి, త‌నీష్‌ల‌కి ‘రంగు రబ్బా.. రబ్బా’ అనే రఫ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ‘రంగు రబ్బా.. రబ్బా’ అంటూ గోడకు పెయింట్ వేయాలి. సంచాలకులను ఇంటి సభ్యులే ఎన్నుకోవాలి. అతడిదే తుది నిర్ణయం అంటూ బిగ్ బాస్ నియమం పెట్టడంతో సంచాలకులు ఎవరు ఉంటే బావుంటుందా? అని చర్చలు జ‌రిపి చివ‌రికి దీప్తి సున‌య‌నని సంచాల‌కులుగా నియ‌మించారు. మ‌రి ఆస‌క్తిగా జ‌రిగిన ఈ కెప్టెన్సీ టాస్క్‌లో విజేత‌గా ఎవ‌రు నిలుస్తారో తెలియాలంటే కొద్ది గంట‌లు ఆగాల్సిందే.

2928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS