స‌ల్మాన్‌ని బెదిరించిన వ్య‌క్తులు అరెస్ట్

Fri,October 4, 2019 11:16 AM

గ‌త వారం ప్రారంభంలో ఇద్ద‌రు వ్య‌క్తులు బాలీవుడ్ నటుడు స‌ల్మాన్ ఖాన్‌ని సోష‌ల్ మీడియాలో బెదిరించిన సంగ‌తి తెలిసిందే. ప‌బ్లిసిటీ కోసం సెప్టెంబ‌ర్ 6న వారు స‌ల్మాన్‌ని బెదిరించారు. తాజాగా వారిద్ద‌రు దొంగత‌నం, మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా కేసులో పోలీసుల‌కి దొరికారు. వారి పేర్లు జాకీ బిష్ణోయ్ అలియాస్ లారెన్స్ బాబ‌ల్‌, జ‌గ‌దీష్‌. అయితే జోధ్‌పూర్‌లోని లారెన్స్ ముఠాతో త‌న‌కి సంబంధం ఉన్న‌ట్టు అంద‌రు న‌మ్మాల‌ని జాకీ త‌న పేరుకి ముందు లారెన్స్ త‌గిలించి లారెన్స్ జాకీ అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విలాస‌వంత‌మైన కారులో వెళుతున్న స‌మ‌యంలో పోలీసులు వారిని ప‌ట్టుకొని విచారించ‌గా దొంగతనం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు.

1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles