వినయ విధేయ రామ.. 'తందానె తందానె' సాంగ్ రిలీజ్ రేపే..!

Sun,December 2, 2018 02:40 PM

వినయ విధేయ రామ.. రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కావడం.. బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్‌ చేతిలో చరణ్ పడటంతో.. సినిమా సూపర్ డూపర్ హిట్టే ఇక అంటూ మెగా అభిమానులు ఫిక్సయిపోయారు.


ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ ఈసినిమాలో విలన్. ఇటీవలే రిలీజయిన ఈ సినిమా టీజర్‌కు బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రధాన పాత్రల్లో స్నేహ, జీన్స్ ఫేం ప్రశాంత్, నవీన్ చంద్ర నటిస్తుండగా ఈ మూవీకి సంబంధించిన ఫ్యామిలీ సాంగ్ తందానె తందానెను రేపు అనగా డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు దేవిశ్రీప్రసాద్ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు.


4142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles