అమెరికా వెళ్లినప్పుడు ఏం జరిగిందో క్లియర్ గా వివరించిన మెహరీన్

Tue,July 3, 2018 03:59 PM
Mehreen Pirzada opens on america incident

ఇటీవల టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అంశం సెక్స్ రాకెట్ . తెలుగు నటీమణులు, యాంకర్స్ తో కిషన్ మోదుగుమూడి దంపతులు నిర్వహించిన సెక్స్ రాకెట్ ని అమెరికా పోలీసులు చేధించటంతో ఇది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇష్యూ తర్వాత టాలీవుడ్ కి సంబంధించిన నటీమణులు పలు కార్యక్రమాల కోసం అమెరికా వెళ్లాలని వీసా కోసం ప్రయత్నించగా అవి కూడా రిజెక్ట్ అయిన సంగతి తెలిసిందే.

నాని నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ‌ మెహరీన్ . ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే ఈమెకి అమెరికాలో చేదు అనుభ‌వం ఎదురైన‌ట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌కి చెందిన కొంద‌రు హీరోయిన్స్ చికాగో సెక్స్ రాకెట్‌లో ఇరుక్కోవ‌డంతో అమెరికా పోలీసులు అక్కడికి వ‌స్తున్న తెలుగు సెల‌బ్రిటీల‌ని లోతుగా విచారించారని, ఈ క్రమంలో త‌న కుటుంబాన్ని క‌ల‌వ‌డానికి వెళ్లిన మెహ‌రీన్‌ని కూడా ప్రశ్నించారని ప్రచారం జరిగింది. అంతేకాక ఈ విషయాలని ఓ మీడియాతో చెప్పినట్టుగా కూడా కథనాలు వచ్చాయి.

కెనడాలోని వాంకోవర్ నుంచి లాస్ వేగాస్ కి హాలీడే ట్రిప్ నేపథ్యంలో వెళ్ళిన మెహరీన్ ను అధికారులు విచారించిన వైనం పై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. పలు మీడియా సంస్థలలో నేను ఈ వైనంపై ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. నేను లాస్ వేగాస్ కి వెళ్లే సమయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను తెలుగు నటిగా గుర్తించి, ఇక్కడికి రావడానికి గల కారణమేంటని ప్రశ్నించారు. ఆ సమయంలోనే సెక్స్ స్కాండల్ గురించి నాకు తెలిసింది. అయితే ఈ మేటర్ తో తనకెలాంటిసంబంధం లేదని గుర్తించిన అధికారులు సారీ చెప్పి, నా ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేశారు.

ఈ విషయాలపై ఇతరులు క్లారిటీ ఇవ్వటం కన్నా, నేను చెప్పడమే మంచిదని భావించి ట్విట్టర్ లో ఈ ట్వీట్ చేస్తున్నాను. అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు ఇబ్బందికరమే అయినప్పటికి, అది నా పర్సనల్ విషయం. ఎవరో చేసిన పనికి ఇండస్ట్రీలోని వారందరికి చెడు పేరు రావడం బాధ కలిగిస్తుంది. తప్పు చేసిన వాళ్ళకి సరైన శిక్ష తప్పక పడుతుందని భావిస్తున్నాను. ఇండస్ట్రీ నన్ను బాగా ఆదరించింది. ఈ విషయంపై మాట్లాడటం ఇదే చివరిసారి. రానున్నరోజులలో నా ప్రమేయం లేకుండా ఎలాంటి తప్పుడు కథనాలు మీడియా ప్రచురించదని అనుకుంటున్నాను అంటూ ముగించింది మెహరీన్ .

ఇటీవలి కాలంలో మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న మెహరీన్ కేరాఫ్ సూర్య, జవాన్ చిత్రాలలోను నటించింది. ఈ రెండు చిత్రాలు కాస్త నిరాశపరచాయి. అయితే ప్రస్తుతం మాచో హీరో గోపిచంద్ సరసన పంతం అనే సినిమాలో నటిస్తుంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలోను కథానాయికగా నటిస్తుంది మెహరీన్. వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'ఎఫ్ 2' చిత్రంలోను కథానాయికగా ఎంపికైన మెహరీన్ ..నితిన్ సరసన జతకట్టే ఆఫర్ కూడా అందుకుంద‌ని స‌మాచారం.


4498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles