మెహ‌రీన్‌కి అమెరికాలో చేదు అనుభ‌వం..!

Sun,June 17, 2018 10:53 AM
Mehreen Pirzada gets problems in america

నాని నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ‌ మెహరీన్ . ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మ‌డికి అమెరికాలో చేదు అనుభ‌వం ఎదురైన‌ట్టు తెలుస్తుంది. టాలీవుడ్‌కి చెందిన కొంద‌రు హీరోయిన్స్ చికాగో సెక్స్ రాకెట్‌లో ఇరుక్కోవ‌డంతో అమెరికా పోలీసులు అక్క‌డికి వ‌స్తున్న తెలుగు సెల‌బ్రిటీల‌ని లోతుగా విచారిస్తున్నారట‌. ఈ క్ర‌మంలో త‌న కుటుంబాన్ని క‌ల‌వ‌డానికి వెళ్లిన మెహ‌రీన్‌ని కూడా ప్ర‌శ్నించార‌ట‌.

మెహరీన్ అమెరికాలో ఉన్న త‌న కుటుంబ స‌భ్యుల‌ని క‌ల‌వడానికి యూఎస్ వెళ్లింది. అక్క‌డి నుండి కెన‌డాలో స్నేహితుల‌ని క‌లిసేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ల‌గా, అధికారులు ఆమె టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్ అని తెలిసి 30 నిమిషాల పాటు విచారించార‌ట‌. విచార‌ణ‌లో అన్ని ప్రశ్న‌ల‌కి స‌మాధానం ఇచ్చిన మెహ‌రీన్ త‌న ఫ్యామిలీని క‌లిసేందుకే వ‌చ్చానని అన్నార‌ట‌. అయితే త‌న‌కి ఇబ్బంది క‌లిగించినందుకు అధికారులు క్ష‌మాప‌ణ చెప్పార‌ని మెహ‌రీన్ ఓ వార్త ప‌త్రిక‌కి తెలిపారు. నిర్మాత కిషన్‌ మోదుగుమూడి, అతని భార్య చంద్రకళ సాగించిన సెక్స్ రాకెట్ కార‌ణంగా ఇప్పుడు ఏ త‌ప్పు చేయ‌ని వారు కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.

ఈ మధ్య మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న మెహరీన్ కేరాఫ్ సూర్య, జవాన్ చిత్రాలలోను నటించింది. ఈ రెండు చిత్రాలు కాస్త నిరాశపరచాయి. అయితే ప్రస్తుతం మాచో హీరో గోపిచంద్ సరసన పంతం అనే సినిమాలో నటిస్తుంది. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలోను కథానాయికగా నటిస్తుంది మెహరీన్. వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'ఎఫ్ 2' చిత్రంలోను కథానాయికగా ఎంపికైన మెహరీన్ ..నితిన్ సరసన జతకట్టే ఆఫర్ కూడా అందుకుంద‌ని స‌మాచారం.

4432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS