మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆఫ‌ర్ కొట్టేసిన మెహ‌రీన్

Wed,January 3, 2018 10:31 AM
Mehreen Pirzada gets crazy offers in tollywood

నాని న‌టించిన కృష్ణ గాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మెహరీన్ టాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంది. ఈ మధ్య మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న మెహరీన్ ..మాచో హీరో గోపిచంద్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింద‌ని తెలుస్తుంది. కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్ లో గోపిచంద్ ఓ మూవీ చేయనుండగా ఇందులో మెహరీన్ ని కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇదే కాక వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)మూవీలో వరుణ్ తేజ్ పక్కన జోడిగా మెహ్రీన్ ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది. మెహరీన్ తన హవా ఇలానే కొనసాగిస్తే రానున్న రోజులలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయమని అంటున్నారు.

2093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles