పంజాబీ పిల్ల తలుపు తడుతున్న వరుస ఆఫర్లు

Wed,May 2, 2018 03:56 PM
Mehreen Pirzada  gets crazy offers

నాని నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మెహరీన్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ మధ్య మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న మెహరీన్ కేరాఫ్ సూర్య, జవాన్ చిత్రాలలోను నటించింది. ఈ రెండు చిత్రాలు కాస్త నిరాశపరచాయి. అయితే ప్రస్తుతం మాచో హీరో గోపిచంద్ సరసన పంతం అనే సినిమాలో నటిస్తుంది. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలోను కథానాయికగా నటిస్తుంది మెహరీన్.

వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'ఎఫ్ 2' చిత్రంలోను కథానాయికగా ఎంపికైన మెహరీన్ ..నితిన్ సరసన జతకట్టే ఆఫర్ అందుకుందట. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేస్తున్న నితిన్ ఈ మూవీ తర్వాత నాగశౌర్యకి ఛలో వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇందులో మెహరీన్ ని కథానాయికగా పరిశీలిస్తున్నారని టాక్. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలలో నటించని ఈ అమ్మడు ఇటీవల ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ పై కాస్త హాట్ గా దర్శనమిచ్చింది. అంటే గ్లామర్ రోల్స్ కి ఈ అమ్మడు సై అనే ఇండికేషన్ ఇచ్చినట్టే అర్ధమవుతుంది. దీంతో రానున్న రోజులలో మరిన్ని ఆఫర్స్ మెహరీన్ కి రావడం ఖాయమంటున్నారు .

4097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles