మెహరీన్ హవా మాములుగా లేదు

Tue,November 14, 2017 11:28 AM

టాలీవుడ్లో మెహరీన్ హవా మాములుగా లేదు. కృష్ణ గాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయింది. ఈ మధ్య మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న మెహరీన్ ..జవాన్ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఈ అమ్మడు భావిస్తుంది. అయితే ఇప్పుడు మాచో హీరో గోపిచంద్ సరసన నటించే ఛాన్స్ మెహరీన్ కి వచ్చిందని అంటున్నారు. కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్ లో గోపిచంద్ ఓ మూవీ చేయనుండగా ఇందులో మెహరీన్ ని కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారట. మరి దీనిపై పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది. మెహరీన్ తన హవా ఇలానే కొనసాగిస్తే రానున్న రోజులలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయమని అంటున్నారు.

2145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles